Sunday, May 11, 2025
Homeసినిమాఊహించని స్థాయిలో విజయం

ఊహించని స్థాయిలో విజయం

- Advertisement -

నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్‌ : ది థర్డ్‌ కేస్‌’. డాక్టర్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈనెల 1న ఈ పాన్‌ ఇండియా సినిమా గ్రాండ్‌గా రిలీజై, విజయవంతంగా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ,’దేశంలో పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా, సెలబ్రేషన్స్‌ చేయొచ్చా అనే చర్చ వచ్చింది. శత్రువులు మనకి ఒక ప్రాబ్లం క్రియేట్‌ చేయాలని ప్రయత్నించారు. దానికి మన దేశం, సైన్యం చాలా హూందాగా బదులు చెప్పింది. వాళ్లు చేసిన పని వల్ల ఇండియాలో ఒకచోట సక్సెస్‌ సెలబ్రేషన్‌ క్యాన్సిల్‌ అయిందని ఒక శాటిస్ఫాక్షన్‌ కూడా వాళ్లకి ఇవ్వకూడదని ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్‌ చేయడం జరిగింది. సైన్యంలో ఉన్న అందరికీ నా, మా టీం తరపునుంచి ఏ బిగ్‌ సెల్యూట్‌. మా సినిమా సక్సెస్‌ అవుతుందని అనుకున్నాను కానీ ఈ స్థాయిలో సక్సెస్‌ అవుతుందని నేను ఊహించలేదు. ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ని ఒక బిగ్‌ మాస్‌ కమర్షియల్‌ సినిమాలా సెలెబ్రేట్‌ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. థియేటర్స్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే అద్భుతం అనిపించింది. శైలేష్‌ పతి సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు. తనకి హిలేరియస్‌ కామెడీ టైమింగ్‌ ఉంది. తనతో నేను చేయబోయే నెక్స్ట్‌ సినిమా మాత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. 2025లో అటు ‘కోర్ట్‌’ ఇటు ‘హిట్‌ 3..’ వెరీ మెమరబుల్‌ ఇయర్‌. 2026 దీన్ని మించి ల్యాండ్‌ చేయడానికి ట్రై చేస్తాం’ అని తెలిపారు.
‘జనాలు థియేటర్స్‌కి రాని సమయంలో ఒక మంచి హిట్‌ ఇచ్చారని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆడియన్స్‌ అందరికీ ధన్యవాదాలు. నానితో జర్నీ స్టార్ట్‌ అయినప్పుడు నేను కొంచెం భయపడ్డాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన వ్యక్తితో జర్నీ చేసినప్పుడు అనుకున్న స్థాయికి రీచ్‌ అవ్వాలని ప్రతి రోజు హార్డ్‌ వర్క్‌ చేస్తూ ఈ జర్నీ సాగింది. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను’ అని డైరెక్టర్‌ శైలేష్‌ కొలను చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -