నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మే7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలో పాక్ కూడా ఇండియాపై ప్రతిదాడులు చేసింది. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత్ కాల్పలు జరపగా..దాయాది దేశం సామాన్య పౌరుల నివాసాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడింది. జమ్ములోరి ఎల్ఓసీకీ సమీపంలో పలు షేల్లింగ్ దాడులకు పాల్పడ్డగా ..భారత్ బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అయితే కొన్ని క్షిపణులు, డ్రోన్లు పేలకుండ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండిపోయాయి. తాజాగా వాటిని నిర్వీర్యం చేసే పనిలో ఆర్మీ బలగాలు నిమగ్నమైయ్యాయి. జమ్మూలోని రాజౌరి జిల్లా పరిధిలో పేలని క్షిపణులను కోసం భదత్రా బలగాలు అన్వేషణ చేపట్టాయి. LoCకి అతి సమీపంగా ఉండే నౌషరా అనే గ్రామంలో పేలని క్షిపణులు, డ్రోన్లు కోసం జల్లెడ పడుతున్నారు ఆర్మీ అధికారులు.
సరిహద్దులో పేలని పాక్ క్షిపణులు..నిర్వీర్యం చేస్తున్న ఆర్మీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES