Friday, September 19, 2025
E-PAPER
Homeక్రైమ్లింగ మడుగుపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

లింగ మడుగుపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగ మడుగుపల్లి గ్రామపంచాయతీ ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానిక సీఐ సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగమడుగు పల్లి గ్రామానికి చెందిన చల్లా రవి ఇంటి ఎదుట వేముల వీరాస్వామి బావిలో గుర్తు తెలియని ఓ మగవ్యక్తి మృతదేహం వెల్లకిలా పడి ఉందని శుక్రవారం సమాచారం అందింది. ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

మృతుడి వయసు సుమారు (45–50)సంవత్సరాల మధ్యలో ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని అన్నారు. మృతదేహంపై తెల్లని గీతలున్న ఫుల్‌షర్ట్, నీలి రంగు 7 నెంబర్ చెప్పులు ఉన్నాయి. కుడి చేతి ఉంగర వేళికి ఒక రింగ్ ఉన్నట్లు గుర్తించారు. అయితే మృతుడి ముఖ భాగం పురుగుల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నందున ఆయనను గుర్తు పట్టలేకపోయామన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్, ఎస్.హెచ్.ఓ లేదా క్రింది నంబర్లకు సమాచారం అందించవలసిందిగా కోరారు. 

సంప్రదించవలసిన నంబర్లు: సీఐ, ఆత్మకూరు 8712685225, ఎస్సై, ఆత్మకూరు 8712685252.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -