- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంగవాడిల్లోని చిన్నారులకు పోషకాహారంతోపాటు యూనిపామ్స్ అందజేస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామంలోని అంగన్ వాడి సెంటర్-2లో బుధవారం సర్పంచ్ గుగులోతు మంజుల-జగన్ చిన్నారులకు యూనిపామ్స్ అందజేశారు. అంతకముందు చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి అన్నప్రసన్న కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, అంగన్ వాడి టీచర్ ప్రమిలా చిన్నారులు, తల్లిదండ్రులు, ఆయా పాల్గొన్నారు.
- Advertisement -



