Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లెక్క లేనంత ఖర్చు.!

లెక్క లేనంత ఖర్చు.!

- Advertisement -

సర్పంచుల గౌరవ వేతనం నెలకు రూ.6,500
ఎన్నికల్లో గెలిచేందుకు లక్షల్లో ఖర్చు
నవతెలంగాణ – మల్హర్ రావు

సర్పంచులుగా పనిచేసే వారికి ప్రతి నెలా రూ.6,500 చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ లెక్కన వారి పదవీ కాలంలో మొత్తం పొందే వేతనం రూ.3.90లక్షలు. కానీ పదవిని దక్కించుకునేందుకు ఎన్నికల సమయంలో అభ్యర్థులు మాత్రం ఖర్చులు లెక్క లేనంతగా ఉంటోంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ వేతనం, గెలవడం కోసం ఎన్నికల్లో వారు చేస్తున్న ఖర్చుపై పల్లెల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల్లో సర్పంచ్లుగా బరిలో ఉన్న అభ్యర్థులు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు.

చిన్న గ్రామాల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అభ్యర్థులు వెనుకాడటం లేదు. వేలం పాట ద్వారా సర్పంచ్ పదవిని పొందినవారు రూ.10 లక్షల నుం చి రూ.25 లక్షల వరకు గ్రామాభివృద్ధి కమిటీలకు చెల్లింపులు పూర్తి చేశారు. వేలం పాట లేని చోట ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎంత ఖర్చుకైనా అభ్యర్థులు వెనుకాడటం లేదు. మద్యం, మాంసంతోపాటు ఓటుకు ఇంత అని ధర నిర్ణయించడం గమనార్హం. జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడితే వారు అందరూ కలిసి చేస్తున్న ఖర్చు రూ.1 కోటి దాటిపోతోంది. సర్పంచ్ల గౌరవ వేతనానికి, వారు గెలవడానికి చేస్తున్న ఖర్చుకు తేడా ఎంతో ఉండటం ప్రజాస్వామ్యానికి కీడు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -