నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రైల్వేలు, పట్టణ రవాణా, విమానయానంలో ప్రధాన పెట్టుబడులు సహా అనేక మౌలిక సదుపాయాలు, విధాన నిర్ణయాలను ఆమోదించింది. వాటి నిర్మాణానికి మొత్తం రూ.12,236 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. మంగళవారం మంత్రి వర్గ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అదే విధంగా కేరళ రాష్ట్ర పేరు మార్పు కూడా ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిన కీలక అంశాలు
రూ.5,236 కోట్ల అంచనా వ్యయంతో గోండియా-జబల్‌పూర్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడం.
గమ్హారియా మరియు చాండిల్ మధ్య 3వ, 4వ లైన్, ప్రాజెక్టు వ్యయం రూ. 1,168 కోట్లు.
శ్రీనగర్‌లో రూ. 1,667 కోట్ల వ్యయంతో కొత్త ఇంటిగ్రేటెడ్ విమానాశ్రయ టెర్మినల్
అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ యొక్క ఫేజ్ 2బి విస్తరణకు కూడా మంత్రివర్గం ఆమోదం
పట్టణ కనెక్టివిటీని బలోపేతం చేసే లక్ష్యంతో రూ. 1,067 కోట్లు కేటాయింపులు
ముడి జనపనారకు కనీస మద్దతు ధర(MSP)కు మంత్రివర్గం ఆమోదం



