- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ విధించనుందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పందించారు. ఆ ప్రచారాలను కొట్టిపడేశారు. అవి పూర్తిగా అవాస్తమన్నారు. ప్రభుత్వం దృష్టికి ఇంత వరకు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదన్నారు. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న సమయంలో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రూమర్స్‌ను వ్యాప్తి చేసి, భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు బాధ్యతారహితమైనవని, హానికరమైనవని పేర్కొన్నారు.
- Advertisement -



