నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల ఎంపీలు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మకర ద్వారం వద్ద బ్యానర్ చేతబూని భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎఫ్‌స్టిన్‌తో సత్సంబంధాలు కలిగిన సదురు కేంద్ర మంత్రిని తక్షణమే పదవీనుంచి బర్తరప్ చేయాలని నినాదాలు చేశారు.
రెండురోజుల క్రితం అనిల్ అంబానీ, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీలకు ఎఫ్‌స్టిన్‌తో సంబంధం ఉందని, వారి పేర్లు కూడా బయటపడ్డాయని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్ సభలో చెప్పారు. అనిల్ అంబానీని జైలో ఎందుకు వేయడంలేదని మోడీ సర్కార్‌ను ప్రశ్నించారు. అదే విధంగా హర్‌దీప్ సింగ్ పూరీ మంత్రి పదవీకి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో ఎఫ్‌స్టిన్ ఫైల్స్ తో సంబంధమున్న అధికారులు, నాయకులు తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని ఆయన తెలియజేశారు.
ఆ తర్వాత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి పూరి, ఎఫ్‌స్టిన్ ను పలుమార్లు కలిసినట్లు ఆయన మీడియా సమావేశంలో అంగీకరించారు. దీంతో తాజాగా కేంద్ర మంత్రి పదవీకి పూరి రాజీనామా చేయాలని విపక్షాల ఎంపీలు పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
యూరప్ దేశాల్లో ఎఫ్‌స్టిన్ ఫైల్స్ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశాల్లో అనేక మంది రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని, బిల్ గ్రేట్స్, ఎలాన్ మస్క్‌లతో పాటు అనేక దేశాల ప్రముఖ వ్యక్తుల చీకటి రాసలీలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్‌స్టిన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన యూఎస్ న్యాయశాఖ రోజుకో ఫైల్ బయటపెడుతూ..దర్యాప్తును కొనసాగిస్తుంది.



