Friday, May 2, 2025
Homeసినిమాయూనిక్‌ యాక్షన్‌ సినిమా

యూనిక్‌ యాక్షన్‌ సినిమా

ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి 1990 నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్‌ క్రైమ్‌ డ్రామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘#JKQ – కింగ్‌ జాకీ క్వీన్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కు తున్న ఈ చిత్రంలో ‘దసరా’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు పొందిన దీక్షిత్‌ శెట్టితో పాటు శశి ఓదెల, యుక్తి తరేజా లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. కె.కె. దర్శకత్వం వహించారు. హీరో నాని ఈ చిత్ర టీజర్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో దీక్షిత్‌ శెట్టి మాట్లాడుతూ,”దసరా’ తర్వాత మిమ్మల్ని కలవడం, రెండేళ్ల తర్వాత అదే ప్రొడక్షన్‌ హౌస్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన డైరెక్టర్‌కి థ్యాంక్స్‌. మా టీజర్‌ని లాంచ్‌ చేసిన నానికి హదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ‘ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఓ మంచి సినిమాతో మీముందుకు రాబోతున్నాం. మా ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారనే నమ్మకంతో ఉన్నాం’ అని హీరోయిన్‌ యుక్తి తరేజా చెప్పారు. హీరో శశి మాట్లాడుతూ,’ ఈ సినిమా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇంత మంచి క్యారెక్టర్‌ రాసి, కొత్త వాడినైనా నేను చేయగలరని నమ్మిన మేకర్స్‌కి హ్యాట్సాఫ్‌’ అని అన్నారు. ‘ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్‌’ అని డైరెక్టర్‌ కేకే తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img