- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఎస్సికాలనిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తాళం గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టి, రూ.40 వేలు విలువగల టివి దొంగతనం చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పాఠశాల ఉపాధ్యాయులు అరుణ్ కుమార్,సురేష్ తెలిపిన పూర్తి కథనం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటలకు బడిబాట కార్యక్రమాన్నీ నిర్వహించడానికి పాఠశాల తాళం తిస్తామనే క్రమంలో తాళం పగలగొట్టి రూ.40 వేలు టివి ఎత్తుకెళ్లినట్లుగా కనిపించిందని తెలిపారు.ఈ సంఘటనపై కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లుగా ఉపాధ్యాయుడు అరుణ్ కుమార్ తెలిపారు.
- Advertisement -