– ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు
– కేసు నమోదు చేసిన హయత్‌నగర్ పోలీసులు
నవతెలంగాణ-సూర్యాపేట/ హయత్ నగర్
పెద్దమొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో మంగళవారం అక్రమ బుల్లెట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఉన్న డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో అక్రమ బుల్లెట్లు, భారీగా ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఆయుధాల కేసులో హయత్‌నగర్ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నాగరాజ్‌గౌడ్ తెలిపిన వివరాలు, తెలిసిన విషయాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయనగర్ రోడ్ నెంబర్-2లో ఉన్న డీఎస్పీ కె.పార్థసారథి నివాసంతోపాటు మరో రెండు చోట్ల మంగళవారం ఏసీబీ ఇన్‌స్పెక్టర్ మురళీమోహన్, అధికారులు సోదాలు చేశారు. 21 రౌండ్ల లైవ్ బుల్లెట్లు, 69 ఖాళీ క్యార్‌ట్రిడ్జ్‌లు, ఒక క్యార్‌ట్రిడ్జ్ స్టాండ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల విషయంపై హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయుధాల నియంత్రణ చట్టం ప్రకారం పార్థసారథిపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి ఇంట్లో లైసెన్స్ లేని బుల్లెట్లు ఉండటంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తును మరింత లోతుగా జరపనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్కానింగ్ సెంటర్ యజమానిని కేసు నుంచి తప్పించేందుకు రూ.25 లక్షల లంచం డిమాండ్ చేసి, రూ.16 లక్షల వద్ద డీల్ కుదుర్చుకున్న ఘటనలో పార్థసారథి, సూర్యాపేట టౌన్ ఇన్‌స్పెక్టర్ వీర రాఘవులును ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో లైసెన్స్ లేని బుల్లెట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES