Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయం‘ఉన్నావో’ కేసు విచార‌ణ‌..సుప్రీంకోర్టు వ‌ద్ద ఉద్రిక్త‌త‌

‘ఉన్నావో’ కేసు విచార‌ణ‌..సుప్రీంకోర్టు వ‌ద్ద ఉద్రిక్త‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉన్నావ్ లైంగిక‌దాడి బాధిరాలుకు రోజుకు రోజుకు దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇటీవ‌ల ఢిల్లీ హైకోర్టు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప‌లు మ‌హిళ సంఘాలు కోర్టు ప్రాంగ‌ణం ఎదుట ఆందోల‌న నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. తాజాగా సుప్రీం కోర్టు ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ శ్రేణుల‌తో పాటు వివిధ సంఘాల నాయ‌కులు భారీగా ఆందోళ‌న చేప‌ట్టారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్ద్‌ప్ సింగ్ సెగార్‌కు బెయిల్ వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని, ఉన్నావ్ బాధిత‌రాలికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ అల్కా లాంబా నాయకత్వం వహించారు. పోలీసులు అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

2017 ఉన్నావ్ అత్యాచార దోషి కుల్దీప్ సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. క్రైమ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ నేడు విచారించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -