Saturday, December 27, 2025
E-PAPER
Homeజాతీయంసీబీఐని క‌లిసిన ‘ఉన్నావో’ బాధితురాలు

సీబీఐని క‌లిసిన ‘ఉన్నావో’ బాధితురాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సీబీఐ అధికారుల‌ను ఉన్నావో లైంగిక‌దాడి బాధితురాలు క‌లిశారు. ఆమె త‌ల్లితో క‌లిసి ఢిల్లీలోని ప్ర‌ధాన కార్యాల‌యంలో అధికారుల‌కు పిటిష‌న్ అంద‌జేశారు. న్యాయస్థానం స‌రైన విధంగా కేసును ప‌రిశీలించ‌లేద‌ని, ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించి సెగార్‌కు బెయిల్ మంజూరు చేసిన‌ట్టు బాధితులు పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఉన్నావ్ లైంగిక దాడి కేసులో ప్ర‌ధాన నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్ద్‌ప్ సింగ్ సెగ‌ర్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు ర‌ద్దు తో పాటు బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌లు రోజుల నుంచి న్యాయ‌స్థానం నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తమ‌వుతున్నాయి. కోర్టు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ బాధితులు, ప‌లు సంఘాల నాయ‌కురాలు కోర్టు ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. సెగార్‌కు మంజూరు చేసిన బెయిల్ ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఢిల్లీ హైకోర్టు నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టులో సీబీఐ స‌వాల్ చేసింది..స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈక్ర‌మంలోనే సీబీఐకి ఉన్నావో బాధితురాలు ప్ర‌త్యేక‌గా క‌లిసి పిటిష‌న్ ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -