- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పాలస్తీనాపై ఇజ్రాయిల్ దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయిల్ సైన్యం దాడుల వల్ల ఇప్పటికే వేలాది మంది మృతి చెందారు. తాజాగా ఇజ్రాయిల్ జరిపిన దాడుల వల్ల కనీసం 29 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇందులో 25 మంది గాజాలోని వారేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక 2023 అక్టోబర్ 7న ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం చేస్తున్న దాడుల వల్ల ఇప్పటివరకు 65, 344 మంది చనిపోయారు. 166,795 మంది గాయాలపాలయ్యారు.
- Advertisement -