Tuesday, October 14, 2025
E-PAPER
Homeఆటలుఎదురులేని బెంగళూరు

ఎదురులేని బెంగళూరు

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) నాల్గో సీజన్‌లో బెంగళూరు టార్పెడోస్‌ జోరు కొనసాగుతుంది. సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలుపొందిన బెంగళూరు టార్పెడోస్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని సెమీఫైనల్‌ బెర్త్‌కు చేరువైంది. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీవీఎల్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్‌పై 17-15, 14-16, 17-15, 16-14తో బెంగళూరు టార్పెడోస్‌ ఉత్కంఠ విజయం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -