నవతెలంగాణ-హైదరాబాద్: అకాల వర్షాలు ఉత్తర భారతదేశాన్ని అతలాకుతలం చేస్తోంది. భీకరమైన ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో భారీ వానాలకు రవాణ వ్యవస్త, జన జీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్ వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. శుక్రవారం ఉదయంనుంచి ఈ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. అదే విధంగా నైనిటాల్ లో ఒక్కసారిగా వాతావరణం మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈతరహా పరిస్థితులు ఈనెల 6వరకు నెలకొంటాయని భారత్ వాతావరణ శాఖ పేర్కొంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో గంటకు 40-50మధ్య బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని ఐఎండీ హెచ్చరించింది.
ఉత్తర భారత్‌లో అకాల వర్షాలు..పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Advertisement -