నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ లో మైనార్టీలైనా హిందువులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో వ్యక్తిపై అతి దారుణంగా దాడి చంపేశారు. డిసెంబర్ 31న దేశంలోని షరియత్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 50 ఏండ్ల వ్యక్తి ఖోకోన్ దాస్ పై ఓ బృందం దాడి చేసింది. పదునైన ఆయుధాలతో గాయపరిచింది. అనంతరం నిప్పటించింది. ఈ దాడిలో ఖోకోన్ దాస్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిపై దాడి జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది నాలుగో ఘటన.
డిఅంతకుముందు అంటే డిసెంబర్ 18వ తేదీన భాలుకాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను ఓ గుంపు కొట్టి చంపింది. డిసెంబర్ 30న కూడా మైమెన్‌సింగ్ జిల్లాలోని ఓ వస్త్ర కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హిందూ కార్మికుడిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఇలా వరుస దాడులతో బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.



