వరి ధాన్యం నాని రైతులు ఆగమాగం..
తేమశాతం చూడకుండానే ధాన్యం కొనుగోలు చేయాలి
నవతెలంగాణ – తాడ్వాయి : అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. గతంలో కొంత వానకు పడిపోగా, రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. అరబిక్ ని ధాన్యాన్ని వర్షానికి తడవకుండా కాపాడుకోవడానికి అన్నదాతలు ఉరుకులు పరుగులు పెట్టారు. తాడ్వాయి మండల కేంద్రంతో పాటు నార్లాపూర్, కాటాపూర్, మేడారం, మిగతా గ్రామాల రైతుల ధాన్యం తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం కుప్పలు తడిసిపోవడంతో, రైతులు తమ పంటను కాపాడుకోవడానికి ప్లాస్టిక్ కవర్లు తార్పల్లి కవర్లు వంటి వాటిని ఉపయోగించి దానిని కప్పి వర్షం నుంచి కాపాడుతున్నారు. అకాల వర్షం వల్ల కల్లాల్లో ఆరపెట్టిన ధాన్యం తడిసిపోవడంతో దాన్యం నాణ్యత తగ్గి నష్టం వాటిల్లుతుంది. కొనుగోలు కేంద్రాలలో నిల్వచేసిన దాన్ని కూడా వర్షానికి తడిసి ముద్దయిపోయింది. అకాల వర్షం వల్ల రైతులు ఆరుగాలం కష్టం వృధాగా పోతుంది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. రైతులు తమ వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తూకాలకు సిద్ధం చేసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తల్లాడిపోయారు. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ధాన్యం తడుస్తుందో అన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. తేమశాతం చూడకుండానే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పగటిపూట ఎండ కొడుతూ రాత్రిపూట వర్షం పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి రైతులు నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మండల రైతులు కోరుకుంటున్నారు.
అందరికంటే ముందు ఏప్రిల్ 8వ తారీఖున వరి కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పోశానని, అప్పటినుంచి ప్రతి రోజు ధాన్యం నానకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నానని అన్నారు. కంటికి ఆపరేషన్ చేసుకుని ధాన్యం వద్ద ముప్పతిప్పలు పడుతున్నానని ఆవేదన చెందారు. సంబంధిత అధికారులు స్పందించి తేమ శాతం లేకుండానే వరి ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేసి డబ్బులు వచ్చే విధంగా చూడాలని కోరుతున్నాడు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
- Advertisement -
RELATED ARTICLES