Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌లో యూపీఐటీఎస్‌ రోడ్‌ షో

హైదరాబాద్‌లో యూపీఐటీఎస్‌ రోడ్‌ షో

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
ఉత్తరప్రదేశ్‌ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (యూపీఐటీఎస్‌) 2025 కోసం హైదరాబాద్‌లో రోడ్‌షో ఏర్పాటు చేసింది. శుక్రవారం ఎఫ్‌టిసిసిఐలో జరిగిన ఈ కార్యక్రమానికి 150 మందికిపై పైగా హాజరు కాగా.. యూపీ ఎంఎస్‌ఎంఎంఈ శాఖ మంత్రి రాకేష్‌ సచన్‌ హాజరై మాట్లాడారు. సెప్టెంబర్‌ 25-29 తేదిల్లో గ్రేటర్‌ నోయిడాలో జరగనున్న ఈ ఎక్స్‌పో వివరాలను ఆయన వెల్లడించారు. ఇందులో బీ2బీ జోన్లు, కొనుగోలుదారులు, విక్రేతలు, ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారన్నారు. ఎంఎస్‌ఎంఈలు, చేతి వృత్తులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఈవీలు, పునరుత్పాదన ఇంధన, వ్యవసాయ తదితర అనేక కంపెనీలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నాయన్నారు. తదుపరి రోడ్‌షోలు బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు రాకేష్‌ సచన్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు సురేష్‌ కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ.. ఇది దేశాభివృద్ధికి దోహదం చేయనుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -