నవతెలంగాణ – హైదరాబాద్: ఉప్పల్‌లో ఎలివేటెడ్ కారిడార్ పనులను తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. 2017లో ప్రారంభమైన ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయి. వాహనదారులు గుంతల రోడ్డుపై అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాలేదని, తొలుత నిర్మాణ పనులు చేపట్టిన గాయత్రీ సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ దసరా నాటికి పూర్తి చేస్తాం: మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES