- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ ఉప్పల్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఓ) కృష్ణారావు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉదయం నాగోల్ నుండి ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయానికి వస్తుండగా రాజ్యలక్ష్మి థియేటర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన కృష్ణారావును 108 అంబులెన్స్‌లో ఎల్బీనగర్ కామినేని హస్పిటల్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
- Advertisement -



