నవతెలంగాణ-హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ యూత్ అసోసియెషన్ తన దేశభక్తిని చాటుకుంది. పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ..పాక్ ఉగ్రశిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ వాయసేనలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 100పైగా ఉగ్రవాదుల శిబిరాలను ఇండియాన్ ఫైటర్ జెట్స్ ధ్వంసం చేయగా అనేక మంది ఉగ్రవాదులు హతమైయ్యారు. అయితే నగరంలోని ఉప్పుగూడకు చెందిన శ్రీ మల్లిఖార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్..ఆపరేషన్ సిందూర్ ను తలపించే థీమ్‌తో కూడిన గణేష్ విగ్రహా నమునాను రూపొందించారు.
స్థానిక కళాకారులు దాదాపు రూ.6 లక్షల ఖర్చుతో రూపొందించిన ఈ విగ్రహంలో.. బ్రహ్మోస్ క్షిపణులు, S-400 రైఫిల్స్, భారతదేశ సైనిక బలాన్ని సూచించే ఆర్మీ మోడల్ థీమ్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ విగ్రహంతో పాటు భారతదేశ సైనిక చరిత్రలోని కీలక సంఘటనలను ప్రదర్శించే పోస్టర్లు రూపొందించారు. వాటిలో మొదటి ఇండో-పాక్ యుద్ధం (1947), రెండో ఇండో-పాక్ యుద్ధం (1965), బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం (1971), కార్గిల్ యుద్ధం (1999), ఉరి దాడి (2016), పుల్వామా దాడి (2019),తో పాటు ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ (2025) ఘట్టాన్ని కూడా ప్రదర్శించారు.
‘2023 లో మనకు చంద్రయాన్ థీమ్ ఉంది, ఈ సంవత్సరం ఆపరేషన్ సిందూర్ జరిగింది, కాబట్టి ఆపరేషన్ సిందూర్ థీమ్ ఎంపిక చేసుకున్నాం. విగ్రహాన్ని పూర్తి చేయడానికి కళాకారుడు 50-55 రోజులు పట్టింది. కనీసం 10 మంది ఉదయం నుండి రాత్రి 2-3 గంటల వరకు పనిచేసి విగ్రహాన్ని తయారు చేశాం’ అని నిర్వహకులు తెలిపారు.