- Advertisement -
– కల్కినగర్ వాసులు యంకె రాంచంద్రం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణ బీజేపీ ఓబీసీ ప్రధాన కార్యదర్శిగా పోతారాజు బస్వలింగం, ఉపాధ్యక్షులుగా వాడికరి రాజేందర్ రావు లు ఎన్నికైన సందర్బంగా వారికి బిజెపి కల్కి నగర్ శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. వారికి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేష్ పెరిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి నిట్టూ రఘుపతి, 195 బూత్ అధ్యక్షులు చంద్రమౌళి, నాయకులు అంబీర్ రాజేందర్, సతీష్, గోపాల్, 9వ వార్డు కల్కి నగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -