– శాఖల మధ్య సమన్వయ లోపం
నవతెలంగాణ-ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో యూరియా పంపిణీ నియంత్రణ కోల్పోయినట్లు పలువురు రైతులు వ్యక్తపరిచారు. వ్యవసాయ శాఖ, ప్రాథమిక సహకార సంఘం, పోలీసు శాఖ సమన్వయ లోపం కనిపిస్తున్నట్లు రైతులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం యురియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఉదయం ఒక లారీ 300 బ్యాగులు రాగా వ్యవసాయ అధికారులు పంపిణీ చేస్తున్న సమయంలో రైతుల ఎక్కువగా రావడంతో టోకెన్లు ఇవ్వాలని పట్టుబట్టారు. దీనితో గందరగోళం ఏర్పడింది. అధికారులు మాత్రం ఇదివరకు ఇచ్చినట్లు పంపిణీ చేస్తామని తెలిపారు అది పూర్తయిన తర్వాత టోకెన్లు పంపిణీ చేస్తామని తెలిపిన వినకపోవడంతో ఒక గందరగోళం ఏర్పడింది .పోలీసులు జోక్యం చేసుకొని నియంత్రించారు. యూరియా తక్కువ, రైతులు ఎక్కువ మంది రావడంతో ఈ గందరగోళం ఏర్పడిందని సంబంధిత అధికారులు తెలిపారు.
నియంత్రణ కోల్పోయిన యూరియా పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES