నవతెలంగాణ-మల్హర్ రావు: వానాకాలం ప్రారంభం నుంచే రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు బారులు తీరారు.యూరియా కోసం చెప్పులను వరుసక్రమంలో పెట్టారు.యూరియా గోదాంకు చేరుకుందన్న విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 8 గంటల నుంచే కార్యాలయం ముందు వరుస కట్టారు. 10 గంటలు దాటినా నిర్వాహకులు యూరియా పంపిణీ ప్రారంభించకపోవడంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ముందు చెప్పులు క్యూలో పెట్టి ఎడ్లబండ్లు,వివిధ రకాల వాహనాలతో వేచి పడిగాపులు కాశారు.అనంతరం అధికారులు యూరియా పంపిణీని చేపట్టారు.ప్రభుత్వం యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండల కేంద్రంతోపాటు మల్లారం, పెద్దతూoడ్ల,చిన్నతూoడ్ల,కొండంపేట,వళ్లెంకుంట,దుబ్బపేట తదితర గ్రామాల రైతులు ఆరోపించారు.
యూరియా తిప్పలు.. క్యూలో చెప్పులు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES