నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త ఉర్జిత్ పటేల్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. కేంద్ర క్యాబినెట్‌కు చెందిన అపాయింట్స్ కమిటీ ఉర్జిత్ నియామకానికి అనుమతి ఇచ్చింది. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఆయన భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐఎంఎఫ్ విధాన పరమైన నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ బోర్డు చూసుకుంటుంది. ఇక ఐఎంఎఫ్‌కు సేవలు అందించడం ఉర్జిత్ పటేల్‌కు ఇది రెండోసారి. 1996-1997 మధ్య ఆయన ఐఎంఎఫ్ తరపున ఆర్బీఐకి పనిచేశారు. రుణాలు, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, పెన్షన్ నిధుల అప్‌డేట్, విదేశీ మార్కెట్ గురించి ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు.
కాగా, ఉర్జిత్ పటేల్ 2016 నుంచి 2018 వరకు ఆర్బీఐ గవర్న్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా తన పదవీకాలం ముగియక ముందే రిజైన్ చేశారు. 2016, సెప్టెంబర్ 4వ తేదీన ఆయన ఆర్బీఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1998 నుంచి 2001 వరకు ఆర్థికశాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖకు కన్సల్టెంట్‌గా చేశారు.