నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం లోని స్థానిక ఖాజి మొహాల్ల జామలే బహార్ దర్గా, కిసాన్ నగర్ బుర్హనియా దర్గా, సొంటే పీర్ దర్గా లొ నిర్వహించే గంధం, ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయం చైర్మన్ అవైస్ చిస్తీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఉర్సు ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాలు మేరకు భువనగిరి పట్టణం లొ ని అన్ని దర్గా ల లో పారిశుధ్యం, టెంట్స్, విద్యుత్ దీపాలు ఏర్పాటు పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ జి రామలింగం., కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, ఎండీ షరీఫ్, అభిద్ అలీ, చల్ల గురుకుల రఘు బాబు, ఎండీ మజర్, సలాద్దీన్, ఎండీ అక్తర్, ఆజాజ్, గుర్రాల శ్రీను, సాయి ఎండీ జలీల్ దర్గా కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గోన్నారు.
ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



