నవతెలంగాణ-హైదరాబాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సాకుతో వెనిజూలపై అమెరికా దాడులు ముమ్మరం చేస్తోంది. పలు రోజుల నుంచి ఆ దేశ పడవలు, నౌకలపై యూఎస్ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఈక్రమంలోనే మరోమారు పలు నౌకలపై దాడులు చేసింది. ఆ దేశ రాజధాని కరాకస్‌లో భారీ పేలుళ్లకు పాల్పడుతోంది. పేలుళ్ల దాటికి స్థానిక ప్రజలు భయాందోళనతో ఇండ్ల నుంచి పరుగులు తీశారు. విమానం తక్కువ ఎత్తులో వస్తూ దాడులకు తెగబడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా వేస్తున్నామన్న పేరుతో అమెరికా ఇటీవలి కాలంలో వెనిజూలకు చెందిన ఓడలపై ముమ్మరంగా దాడులు చేస్తోది. ఆగస్ట్ 14 నుండి అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ దక్షిణ కరేబియన్‌లో నేవీని మోహరించిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్ నుంచి కరేబియన్, పసిఫిక్ జలాలలో 30 దాడులు జరిగాయి. కనీసం 110 మంది చనిపోయారు.ఈ సైన్యం మోహరింపును పలు దేశాలు ఖండిస్తున్నాయి. మదురో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, వెనిజులాలోని సహజవనరులను కొల్లగొట్టే యత్నంగా పేర్కొన్నాయి. సెప్టెంబర్ 2 నుండి, కరేబియన్ మరియు తూరు పసిఫిక్‌లో అమెరికా జరిపిన దాడుల్లో 30కి పైగా నౌకలు ధ్వంసం కాగా, సుమారు 107మంది మరణించారు.



