నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ సముద్రయాన భద్రత కోసం 131 మిలియన్ డాలర్ల విదేశీ సైనిక విక్రయానికి (ఎఫ్‌ఎంఎస్) అమెరికా ఆమోదం తెలిపింది. అధునాతన సీ విజన్ సాఫ్ట్‌వేర్, శిక్షణ మరియు మద్దతు సేవలు ఉన్నట్లు రక్షణ భద్రతా సహకార సంస్థ (డిఎస్‌సిఎ) బుధవారం ఎక్స్‌లో పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశ పరిధిలోని సముద్రయానంపై అవగాహన పెంచడంతో పాటు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. భారతదేశ ఇండో -పసిఫిక్ మారిటైమ్‌పై అవగాహన కోసం సాఫ్ట్‌వేర్, సంబంధిత పరికరాలను 131 మిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో కొనుగోలు చేయడానికి విదేశీ సైనిక అమ్మకాలకు యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికారం ఇస్తుందని ఎక్స్‌లో తెలిపింది. భారత్ మారిటైమ్ అవగాహనతో వ్యూహాత్మక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రస్తుత మరియు భవిష్యత్తు ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొంది.
భారత్‌కు 131మిలియన్ డాలర్ల సైనిక విక్రయాలకు అమెరికా ఆమోదం
- Advertisement -
RELATED ARTICLES