నవతెలంగాణ-హైదరాబాద్: చమురు రవాణాకు అత్యంత కీలక మార్గమైన హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఇరాన్ మోహరించిన మైన్‌లేయర్స్ (Minelayers), నౌకలు లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. తాము జరిపిన దాడుల్లో ఇరాన్ (Iran)కు చెందిన 16 మైన్‌లేయర్స్‌తో పాటు పలు నౌకలు ధ్వంసం అయ్యాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసింది. హర్ముజ్ గుండా అమెరికాకు చెందిన నౌకలను ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమని, వస్తే బాంబులతో పేల్చివేస్తామని ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఇరాన్ ఆర్మీ భారీగా యుద్ధ నౌకలను గస్తీగా నిలిపింది. చమురు రవాణాకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా తాము రక్షణ కల్పిస్తామని ట్రంప్ ప్రకటించిన విషయంతెలిసిందే. ఈక్రమంలోనే ఆయా జల సంధి మార్గంలో మోహరించిన ఇరాన్ నౌకలే లక్ష్యంగా దాడి చేసి ధ్వంసం చేసింది యూఎస్ ఆర్మీ.




