Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రభాకర్‌రావుకు యూఎస్‌ కోర్టు షాక్‌

ప్రభాకర్‌రావుకు యూఎస్‌ కోర్టు షాక్‌

- Advertisement -

– రాజకీయ ఆశ్రయమివ్వాలనే వినతికి నిరాకరణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

అమెరికాలో ఉన్న రాష్ట్ర ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావుకు అమెరికా కోర్టు షాక్‌ ఇచ్చింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న విషయం విదితమే. కాగా, తనకు యూఎస్‌లో రాజకీయ ఆశ్రయమివ్వాలని కోరుతూ అక్కడి కోర్టులో పెట్టుకున్న పిటిషన్‌కు ఎదురుదెబ్బ తగలింది. ప్రభాకర్‌రావుకు రాజకీయ ఆశ్రయమివ్వటానికి నిరాకరిస్తూ అమెరికాలోని కిందిస్థాయి కోర్టు ఆదేశించింది. దీంతో ప్రభాకర్‌రావు తప్పనిసరిగా భారత్‌కు రావాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని ఇక్కడి పోలీసు ఉన్నతాధికార వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, ఇప్పటికే నాంపల్లి కోర్టు తమ ఎదుట హాజరు కావాలంటూ ఈ నెల 31వ తేదీని గడువుగా విధించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad