నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వంపై సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. భారతీయ రైతాంగాన్ని మోసం చేసి యూఎస్‌తో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. దేశ జనాభాలో 70 శాతం వ్యవసాయంపై ఆధారపడిన అన్నదాతలకు బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. యూఎస్ డీల్‌లో అమెరికా వస్తువులపై భారీగా పన్నులు తగ్గించారని, అదే విధంగా భారతీయ ఉత్పత్తులపై 18శాతం టారిఫ్‌లు విధించారని మండిపడ్డారు. ఈ డీల్‌తో యూఎస్ వ్యవసాయ ఉత్పత్తులతో భారత్ మార్కెట్లను నింపేయాలని మోడీ సర్కార్ చూస్తోందని, దీంతో భారతీయు రైతుల ఉత్పత్తులకు గిరాకీ తగ్గి, అన్నదాతలు ఉపాధి కోల్పోయి పరిస్థితి తెలెత్తిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యూఎస్ డీల్‌తో మరోసారి రైతులను బీజేపీ దెబ్బకొట్టిందని ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఎవరి ఒత్తిడి మేరకు ఇండియాన్ మార్కెట్ గేట్లను తెరిచారని విమర్శించారు. ఈ ఒప్పందంతో 70శాతం సాగు మీద ఆధారపడిన జనాభా పొట్టకొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే బీజేపీ, దాని అనుబంధ సంస్థలు విదేశీయుల ఏజెంట్లుగా ఉన్నారు, నేటికీ అలాగే ఉన్నారని, స్వావలంబన, స్వదేశీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు దేశ ఆర్థిక వ్యవస్థను మోసం చేసినందుకు వారు ఎంత కమిషన్ సంపాదించారో చెప్పాలని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.



