నవతెలంగాణ-హైదరాబాద్: మిన్నెసోటాలో శాశ్వత నివాస హోదా కోసం వేచిచూస్తున్న శరణార్థులను ట్రంప్ యంత్రాంగం నిర్బంధించడాన్ని అమెరికా ఫెడరల్ కోర్టు బుధవారం తాత్కాలికంగా అడ్డుకుంది. నిర్బంధించిన శరణార్థులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం మరియు శరణార్థుల స్థితిని సమీక్షించడం కొనసాగించవచ్చు. అయితే ఆ సమీక్ష శరణార్థులను అరెస్ట్ చేయకుండా మరియు నిర్బంధించకుండా కూడా చేయవచ్చు యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్‌టున్‌హైమ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ”శరణార్థులకు అమెరికాలో నివసించేందుకు చట్టబద్ధమైన హక్కు ఉంది, అలాగే పనిచేసే హక్కు, శాంతియుతంగా జీవించే హక్కు ఉంది. మరీ ముఖ్యంగా వారెంట్‌లు లేదా కారణం లేకుండా వారి నివాసాల్లో లేదా మతపరమైన సేవల్లో, నిత్యావసరాలను కొనుగోలు చేసే మార్గంలో అరెస్టు చేయబడటం, నిర్బంధించబడకుండా ఉండే హక్కు కూడా ఉంది” అని జడ్జి రాశారు.
”తరచుగా దౌర్జన్యం మరియు క్రూరత్వంతో నిండిన ప్రపంచంలో అమెరికా వ్యక్తిగత స్వేచ్ఛకు స్వర్గధామంగా పనిచేస్తుంది. మన పొరుగువారిని భయానికి మరియు గందరగోళానికి గురిచేసినపుడు మనం ఆ ఆదర్శాన్ని వదులుకోవాల్సి వుంటుంది అని అన్నారు. ఆపరేషన్ పిఎఆర్‌ఆర్‌ఐఎస్ ఆపరేషన్ పేరుతో నిర్బంధించబడిన ఏ శరణార్థి అయిన కస్టడీ నుండి తక్షణమే విడుదల చేయబడాలి” అని జడ్జి ఉత్తర్వు పేర్కొంది. ”శాశ్వత నివాస హోదా కోసం ఎదరుచూస్తున్న శరణార్థులు కఠినమైన తనిఖీలు, పర్యవేక్షణను ఎదుర్కొన్నారు. పలు ఫెడరల్ ఏజన్సీల ఆమోదంతో అమెరికాలో ప్రవేశం పొందారు. ఇక్కడ పనిచేసేందుకు అనుమతి పొందారు. ప్రభుత్వం నుండి మద్దతు పొందారు మరియు అమెరికాలో పునరావాసం పొందారు” అని జడ్జి పేర్కొన్నారు. ”ఈ వ్యక్తులు దేశంలోకి ప్రవేశించబడ్డారు. నియమాలను అనుసరించారు. మరియు అమెరికా చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కోసం వేచి ఉన్నారు” అని పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ)ని మిన్నెసోటాలోని మరో ఫెడరల్ జడ్జి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులో తీవ్రంగా విమర్శించారు. ఐసిఇ తాత్కాలిక హెడ్ టాడ్ లియోన్స్‌ను విచారణకు హాజరుకావాలని జడ్జి ఆదేశించారు. అనంతరం ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. ఐసిఇ అనేది ఒక చట్టం కాదు అని జడ్జి ఉద్ఘాటించారు. ఐసిఇ జనవరి 2026లో ఫెడరల్ ఏజన్సీలు వారి మొత్తం పదవీకాలంలో ఉల్లంఘించిన దాని కంటే అధికంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఉండవచ్చు అని అన్నారు.
ఇద్దరు అమెరికా పౌరుల మృతిపై ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలాది మంది ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులను మిన్నెసోటాకు పంపిన సంగతి తెలిసిందే. మిన్నెసోటాలో ఇప్పటికీ గ్రీన్ కార్డులు జారీ కాని సుమారు 5,600మంది శరణార్థుల చట్టపరమైన స్థితిని పున:పరిశీలించడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు జనవరిలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పేరుతో పలువురు శరణార్థులను, చిన్నారులను కూడా నిర్బంధించడం తీవ్ర విమర్శలకు గురైంది. ట్రంప్ కఠినమైన వలసవిదానానికి నేతృత్వం వహిస్తున్న వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ ఉత్తర్వులను వ్యతిరేకించారు.


