నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసినా కుమారుడు సాజీబ్ వాజెద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో చెలరేగిన అల్లర్లకు అమెరికాలోని గత ప్రభుత్వం నుంచి చేయుత లభించిందని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ఆవామీలీగ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అల్లరిమూకలకు యూఎస్ నుంచి నగదు సరఫరా అయిందని ఆరోపించారు. యూఎస్ గత సర్కార్ తమ దేశంలోని పాలనను మార్చాలని చూసిందని ఆయన ధ్వజమెత్తారు. యూఎస్‌ఎయిడ్ (USAID) పేరుతో లక్షల కొద్ది డాలర్లు హాసినా వ్యతిరేకులకు అందాయని చెప్పారు. బంగ్లాదేశ్ లో ప్రేటేగిపోతున్నా ఉగ్రవాదులను, అతివాద ఇస్లామిక్ వాదాన్ని అణిచివేసే ప్రయత్నాలు ప్రస్తుత సర్కార్ ముమ్మరం చేసిందని తెలియజేశారు.
భారతదేశం వల్లే తన తల్లి ప్రాణాలు నిలిచాయని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్‌వాజేద్ వెల్లడించారు. ‘‘భారత్ ఎల్లప్పుడూ మంచి మిత్రదేశంగా ఉంది. సంక్షోభ సమయంలో నా తల్లి ప్రాణాలు కాపాడింది. ఆమె బంగ్లా ను వీడకపోయి ఉంటే.. మిలిటెంట్లు ఆమె హత్యకు కుట్రలు చేసేవారు. నా తల్లి ప్రాణాలు కాపాడినందుకు ప్రధాని మోదీకి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని’’ అని సాజిబ్ పేర్కొన్నారు.



