Saturday, March 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంన‌టాంజ్‌పై యూఎస్‌-ఇజ్రాయిల్ దాడులు: ఇరాన్

న‌టాంజ్‌పై యూఎస్‌-ఇజ్రాయిల్ దాడులు: ఇరాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప‌శ్చిమాసియాలో రోజురోజుకు యుద్ధ తీవ్ర పెరిగింది. చ‌మురు నిల్వ‌లు, అణు కేంద్రాలే ల‌క్ష్యంగా దాడులు జ‌రుగుతున్నాయి. తాజాగా న‌టాంజ్ అణు కేంద్రం(Natanz Facility)పై అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాలు దాడి చేసిన‌ట్లు ఇవాళ ఇరాన్ ప్ర‌క‌టించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రిప‌బ్లిక్ అటామిక్ ఎన‌ర్జీ ఆర్గ‌నైజేష‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ బ‌ల‌గాలు త‌మ క్రిమిన‌ల్ దాడులు కొన‌సాగిస్తున్నాయ‌ని, ఇవాళ ఉద‌యం న‌టాంజ్ శుద్దీక‌ర‌ణ కాంప్లెక్స్‌పై దాడి జ‌రిగిన‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. త‌స్నిమ్ న్యూస్ ఏజెన్సీ ఆ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. సెంట్ర‌ల్ ఇరాన్‌లో ఉన్న న‌టాంజ్ అణు కేంద్రం నుంచి ప్ర‌స్తుతానికి ఎటువంటి అణుధార్మిక‌త రిలీజ్ కావ‌డం లేద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -