నవతెలంగాణ-హైదరాబాద్: ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన అటాక్‌లో.. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో ఉన్న ఓ బాలికల స్కూల్‌పై క్షిపణి పడింది. ఆ పేలుడు ఘటనలో సుమారు 160 మంది వరకు విద్యార్థిణులు మరణించారు. ఆ విషాద సంఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. అయితే ఆ దాడి వెనుక అమెరికా ఉన్నట్లు ఇరాన్ ఆరోపించగా, బాలికల స్కూల్‌పై తాము దాడి చేయలేదని ట్రంప్ అన్నారు.
అయితే తాజాగా మినాబ్ స్కూల్‌పై మిస్సైల్ పడుతున్న ఘటనకు చెందిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నది. ఆ వీడియో ఫూటేజ్ ఆధారంగా అది అమెరికా వాడే తోమాహాక్ క్షిపణి(Tomahawk Missile)గా గుర్తించారు. మెహర్ న్యూస్ ఏజెన్సీ ఆ వీడియోను షేర్‌చేసింది. స్కూల్ సమీపంలో ఉన్న ఐఆర్జీసీ నావల్ కాంప్లెక్స్‌ను టార్గెట్ చేసే క్రమంలో బహుశా ఆ క్షిపణి స్కూల్‌పై పడి ఉంటుందని వాషింగ్టన్ పోస్టు తన కథనంలో చెప్పింది. ఇంటెలిజెన్స్ సమాచారం వల్ల ఆ వైఫల్యం జరిగి ఉంటుందని సీబీఎస్ న్యూస్ తన కథనంలో పేర్కొన్నది.



