Monday, October 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసముద్రంలో కుప్పకూలిన అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్

సముద్రంలో కుప్పకూలిన అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు అత్యాధునిక యుద్ధ విమానాలు అరగంట వ్యవధిలోనే కుప్పకూలాయి. యూఎస్ పసిఫిక్‌ ఫ్లీట్‌కు చెందిన యూఎస్ఎస్ నిమిట్జ్ అనే విమాన వాహక నౌక నుంచి బయలుదేరిన ఒక ఫైటర్ జెట్, ఒక హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయాయి. అయితే, ఈ రెండు ఘటనల్లోనూ సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే, యూఎస్ఎస్ నిమిట్జ్ నౌక నుంచి రొటీన్ ఆపరేషన్ల కోసం గాల్లోకి లేచిన ఎంహెచ్-60ఆర్ సీహాక్‌ హెలికాప్టర్‌ అకస్మాత్తుగా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటన జరిగిన 30 నిమిషాల్లోపే, అదే నౌక నుంచి టేకాఫ్ అయిన బోయింగ్‌ ఎఫ్/ఏ-18ఎఫ్ సూపర్‌ హార్నెట్‌ ఫైటర్‌ జెట్‌ కూడా సముద్రంలో పడిపోయింది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని, ఫైటర్ జెట్‌లోని ఇద్దరు పైలట్లను సురక్షితంగా కాపాడినట్లు అమెరికా నేవీ అధికారులు ప్రకటించారు. సాధారణ ఆపరేషన్లలో ఉన్నప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తడం వల్లే ఈ ప్రమాదాలు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ వరుస ప్రమాదాలపై పసిఫిక్‌ ఫ్లీట్‌ కమాండ్‌ దర్యాప్తునకు ఆదేశించింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిబ్బంది ప్రాణాలతో బయటపడినప్పటికీ, రెండు శక్తిమంతమైన యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికా నౌకాదళానికి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -