Tuesday, March 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభూత‌ల దాడుల‌కు యూఎస్ స‌న్నాహాలు..కాళ్లు న‌రికేస్తాం:ఇరాన్‌

భూత‌ల దాడుల‌కు యూఎస్ స‌న్నాహాలు..కాళ్లు న‌రికేస్తాం:ఇరాన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్‌ యుద్ధం ఆపాడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే మరోవైపు ఆ దేశంపై దాడులకు పాల్పడుతున్నారు. అదే విధంగా భూత‌ల దాడుల‌కు అమెరికా స‌న్నాహాలు చేస్తోంది. అయితే అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఇరాన్‌ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. తాజాగా దేశంపై దాడి చేయడానికి ప్రయత్నించే ఏ దురాక్రమణదారుడి కాళ్లను నరికేస్తాం’. దాడికి తమపై దాడికి పాల్పడితే దేశ సాయుధ దళాలు అంతే గట్టిగా ప్రతిస్పందిస్తాయని ఇస్లామిక్‌ రివల్యూషరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జిసి) ఖాతం అల్‌- అన్బియా ప్రధాన కార్యాలయ ప్రతినిధి మంగళవారం హెచ్చరించినట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ప్రెస్‌ టివి పేర్కొంది. అలాగే అమెరికా ఇరాన్‌పై భూతల దాడులకు పాల్పడితే.. ఇరాన్‌ కూడా వాటికి గట్టిగానే బదులిస్తుంది. ఇరాన్‌కు మద్దతుగా రష్యన్‌ చెచెన్‌ యూనిట్లను పంపడానికి సిద్ధమని మీడియా పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -