Saturday, July 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెహల్గామ్‌ దాడి తర్వాత జరిగిన ఉద్రిక్తతల్లో ఐదు విమానాలను కూల్చివేసినట్లు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో రిపబ్లికన్‌ సెనేటర్లకు ఇచ్చిన విందులో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌ పాకిస్తాన్‌ల ఉద్రిక్తతల్లో.. నిజానికి విమానాలను గాలి నుండి కూల్చివేశారు. బహుశా నాలుగు లేదా ఐదు కావొచ్చు. నా అంచనా అయితే.. ఐదు జెట్‌ వమానాలను కూల్చివేశారని అనుకుంటున్నాను. రెండు అణ్వాయుధ దేశాలు ఒకదాని కొకటి ఢకొీంటున్నాయి. రెండు దేశాలు యుద్ధానికి కాలుదువ్వుతుంటే.. మేము ఆ సమయంలో కలగజేసుకుని.. వాణిజ్యం ద్వారా పరిష్కరించాము. మీరు గనుక ఆయుధాలను, అణ్వాయుధాల ఒప్పందాలను ఇరు దేశాలతో ఒప్పందం చేసుకున్నట్లయితే.. మేము వాణిజ్య ఒప్పందం చేసుకోము. నేను చాలా గర్వపడుతున్నవిషయం ఏమిటంటే.. మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తీవ్రమైన చాలా యుద్ధాలను ఆపాము’ అని అన్నారు. అయితే ట్రంప్‌ ఎవర్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా తెలియదు. కానీ ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో యుద్ధ విమానాలు కూలిపోయి ఉండవచ్చనే అభిప్రాయం వెల్లడవుతుంది.

కాగా, పెహల్గామ్‌ దాడి తర్వాత ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్థాన్‌ చెబుతోంది. అయితే పాకిస్తాన్‌ చెప్పిన దానికి సంబంధించిన ఆధారాలను మాత్రం ఆ దేశం ఇప్పటివరకు బహిర్గంతం చేయలేదు.
యుద్ధ విమానాల కూల్చివేత అంశంలో భారత్‌ తొలుత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇటీవల త్రివిధ దళాల అధిపతి అనిల్‌ చౌహాన్‌ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్‌ చెబుతున్నట్లు ఆరు విమానాలను కోల్పోలేదన్నారు. అయితే కూలిపోయిన సంఖ్యను మాత్రం ఆయన కూడా వెల్లడించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -