Saturday, September 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంహెచ్-1 బి వీసాపై యూఎస్ అధ్య‌క్షుడు కీల‌క నిర్ణ‌యం

హెచ్-1 బి వీసాపై యూఎస్ అధ్య‌క్షుడు కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హెచ్‌ -1 బి వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుము విధించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రణాళికపై అమెరికా చట్టసభ సభ్యులు, కమ్యూనిటీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్‌ తీసుకున్న ఈ చర్య నిర్లక్ష్యపూరితమని, దురదృష్టకరమని చట్టసభ సభ్యులు అన్నారు. ఇది ఐటి పరిశ్రమపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజాకృష్ణమూర్తి స్పందించారు.

‘హెచ్‌ 1-బి వీసా దరఖాస్తు రుసుము లక్ష డాలర్లకు పెంచడం వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. మన శ్రామిక శక్తిని దీర్ఘకాలంగా బలోపేతం చేసిన, ఆవిష్కరణలకు ఆజ్యంపోసిన లక్షలాది మంది అమెరికన్లకు ఉపాధి కల్పించే పరిశ్రమలను నిర్మించడంలో సహాయపడిన అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల నుండి అమెరికాను వేరు చేయడానికి ట్రంప్‌ చేసిన నిర్లక్ష్యపూరిత ప్రయత్నం’ అని ఆయన మండిపడ్డారు. చాలామంది హెచ్‌1 -బి వీసాదారులు అమెరికా పౌరులుగా మారి అమెరికాలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలను సృష్టించే వ్యాపారాలను ప్రారంభిస్తారు అని ఆయన అన్నారు. ఇతర దేశాలు ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి పోటీపడుతుండగా, అమెరికా మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా తన శ్రామిక శక్తిని బలోపేతం చేయాలి. వలస వ్యవస్థను ఆధునీకరించాలి. ఆర్థిక వ్యవస్థను దాని భద్రతను బలహీనపరిచే అడ్డంకులను సృష్టించకూడదు అని రాజాకృష్ణమూర్తి హితవుపలికారు.

మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ మాజీ సలహాదారు, వలస విధానంపై ఆసియా- అమెరికన్‌ కమ్యూనిటీ నేత అజరు భూటోరియా మాట్లాడుతూ.. ‘హెచ్‌1-బి రుసుమును విధించాలనే ట్రంప్‌ కొత్త ప్రణాళికతో అమెరికా సాంకేతిక రంగం యొక్క పోటీతత్వం తీవ్ర సంక్షోభానికి గురవుతుంది’ అని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించిన ఆవిష్కరణలకు జీవనాధారమైనది హెచ్‌1-బి కార్యక్రమం. ప్రస్తుత హెచ్‌ -1 బి వీసా దరఖాస్తుల రుసుము రెండువేల డాలర్లు, ఐదు వేల డాలర్లుగా ఉంది. ఈ రుసుము ఒకేసారి లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం.. భవిష్యత్తులో తీవ్ర అడ్డంకులను సృష్టిస్తుంది.

ఇది విభిన్న ప్రతిభపై ఆధారపడే చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లను అణచివేస్తుంది’ అని భూటోరియా ఆందోన వ్యక్తం చేశారు. ట్రంప్‌ చర్యతో ప్రతిభావంతులను కెనడా లేదా యూరప్‌ దేశాలవైపు నెట్టడమే. ఈ చర్య ద్వారా అమెరికాకు ఎదురుదెబ్బ తగలవచ్చు. దీనికిబదులుగా.. స్టార్టప్‌లకు మినహాయింపునివ్వడం లేదా మెరిట్‌ ఆధారిత ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి సమతుల్య సంస్కరణకు ట్రంప్‌ పిలుపునివ్వాలి అని భూటోరియా సలహానిచ్చారు.

హెచ్‌-1 బి వీసాలకు లక్ష డాలర్ల రుసుము చాలా దరదృష్టకరం. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, టెక్‌ పరిశ్రమల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే అమెరికాలోని ఉన్నత విద్యావంతులపై ఇప్పటికే ఎఐ.. సంకాల ప్రతికూల ప్రభావం పడింది అని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌కు చెందిన ఖండేరావ్‌ కాంద్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -