Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం

వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం

- Advertisement -

– నెదర్లాండ్‌ కంపెనీ ప్రతినిధులతో తుమ్మల భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వేగంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయరంగాన్ని ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇదే అంశంపై గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నెదర్లాండ్‌ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారాన్ని అందించడం, రైతుల ఫిర్యాదులకు ఏఐ ఆధారంగా తక్షణం సూచనలు ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, వ్యవసాయ డైరెక్టర్‌ గోపి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.104 కోట్లు : మంత్రి తుమ్మల వెల్లడి
రాష్ట్రంలో వానాకాలానికి (2025-26) వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అందుకు రూ. 104 కోట్లు కేటాయిం చామని తెలిపారు. నియోజకవర్గాల వారీ వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కేటాయింపులు చేయడంతోపాటు వాటిని వెంటనే సరఫరా చేయాల్సిందిగా ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాల యంలో యాంత్రీకరణపై మంత్రి సమీక్షించారు. ఈ పథకంలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ‘నమో డ్రోన్‌ దీదీ’ కింద సరఫరా అయ్యే 381 డ్రోన్లను మహిళా సంఘాలకు అందించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలపై జాతీయ ధరల నిర్ణయక కమిషన్‌ దక్షిణ ప్రాంతీయ సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -