Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంధాన్యం కొనుగోళ్లలో అత్యాధునిక యంత్రాల వినియోగం

ధాన్యం కొనుగోళ్లలో అత్యాధునిక యంత్రాల వినియోగం

- Advertisement -

– పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ డీఎస్‌.చౌహాన్‌
– కొనుగోలు కేంద్రాల పరిశీలన
నవతెలంగాణ – వనపర్తి / పానగల్‌

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తొలిసారి అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి నాణ్యమైన ధాన్యం సేకరించినట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ డిఎస్‌.చౌహాన్‌ తెలిపారు. వనపర్తి జిల్లాలో పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్టర్‌ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లుతో కలిసి చౌహాన్‌ పానగల్‌ మండలంలోని వెంగళాయపల్లి, తెల్లరాళ్ళపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లపై ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యం ఒకసారి కొనుగోలు కేంద్రానికి చేరుకున్నాక పూర్తి బాధ్యత నిర్వాహకులదే అన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి నాణ్యమైన వడ్లు సేకరించేందుకు వ్యాక్యూం పాడి క్లీనర్లు కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసినట్టు చెప్పారు. యంత్రాల ద్వారా ధాన్యంలో చెత్త, తాలు, మట్టిని వేరు చేయొచ్చన్నారు. తేమ శాతం సైతం తగ్గిస్తుందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉండి మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. నాణ్యమైన వడ్లు మిల్లులకు తరలించాక ఒక్క గ్రాము తరుగు తీసినా తనకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. ఆయన వెంట సివిల్‌ సప్లై అధికారి విశ్వనాథ్‌, సివిల్‌ సప్లై డీఎం జగన్మోహన్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad