Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అద్దంకి ఉషాన్ సేవలు మరువలేనిది

అద్దంకి ఉషాన్ సేవలు మరువలేనిది

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్
కార్మిక నేతగా రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ల ఆత్మబంధువుగా అనేక ఉద్యమా లను ,ఉద్యమాలలో కీలకంగనే వ్యవహరించిన అద్దంకి ఉషాన్ సేవలు మరువలేనిదని అందరి గుండెల్లో ఆయన నిలిచి ఉన్నారని సోమవారం బోధన్ లోని గంజి రోడ్ లో అద్దంకి ఉషాన్ సంస్మరణ సభ లో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ పాల్గొని అద్దంకి ఉషాన్ సేవలను కొనియాడారు. అద్దంకి ఉషాన్  బోధన్ డివిజన్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ను అభివృద్ధి పరచడంలో చాలా కీలకపాత్ర వహించారని , ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో అశేష కృషి చేశారని . పెన్షనర్స్ సమస్యలపై అనేక పోరాటాల నిర్వహించారని, ముఖ్యంగా ఆర్టీసీలో ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగుల తరఫున అనేక పోరాటాలు నిర్వహించారని, సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉండేవారని అన్నారు. ఆర్టీసీ కార్మిక నేతలు, పెన్షనర్ సంఘ బాధ్యులు అనేకమంది సంతాప సభలో పాల్గొన్నారు. కల్చరల్ సెక్రెటరీ సిర్ప లింగం  అద్దంకి ఉషాన్  చేసిన పోరాటాల గురించి నిస్వార్థ సేవలు గురించి స్వయంగా పాటను రచించి సభలో పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ తరఫున ప్రకాశం , జ్ఞానేశ్వర్, కృష్ణారావు, నిజామాబాద్ డివిజన్ కోశాధికారి బాలదుర్గయ్య , సాగర్ ఉషాన్ కుటుంబసభ్యులు, వారి బంధు మిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -