నవతెలంగాణ-హైదరాబాద్: రేపు శ్రీలంక వేదికగా పాకిస్థాన్-భారత్‌ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ చరిత్ర పరంగా ఆడినా ప్రతిసారి ఇండియాదే పైచేయి అయింది. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నీలో కూడా ఫైనల్‌లో పాక్ టీంను టీమిండియా ఓడించింది. ఇది అంత బాగానే ఉన్నా..ప్రస్తుతం పాక్-ఇండియా గెలుపు ఓటముల గురించి కాకుండా పాక్ బౌలర్లు ఉస్మాన్ తారీక్ బౌలింగ్ పైన తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. బ్యాటర్లను అయోమయానికి గురిస్తూ..ఆగి బౌలింగ్ చేస్తున్నాడు. ఆది బౌలింగ్ కాదు త్రో అంటూ క్రికెట్ మాజీ ప్లేయర్లతో పాటు ఆటపై అవగాహన ఉన్న సగటు అభిమాని కూడా ఎద్దేవా చేస్తున్నారు.
ఈక్రమంలోనే తాజాగా ప్రెస్ మీట్‌లో పాక్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ పై ఐసీసీ క్లీన్ చీట్ ఇచ్చిందని, అతని బౌలింగ్ పట్ల ఎవరూ ఎలాంటి కామెంట్లు చేసినా తాము పట్టించుకోబోమన్నారు. ఈ తరహా కామెంట్లు తమ బౌలర్లను ప్రభావితం చేయలేవని దీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఉస్మాన్ తారిక్ పాక్ జట్టుకు ట్రంప్ కార్డు అని ప్రశంసించాడు.
” మీరంతా ఉస్మాన్ తారిక్‌కి పెద్ద పేరు తెచ్చారు. మాకు 15 మంది ఆటగాళ్లు ముఖ్యం. అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను మాకు ట్రంప్ కార్డ్ అని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు. అతను ఐసీసీ ద్వారా క్లియర్ అయ్యాడు, ఐపా కానీ ఎందుకు విమర్శలు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అతను మాకు ట్రంప్ కార్డ్, ఈ తరహా కామెంట్ల తారిక్ పట్టించుకోడు” అని అఘా చెప్పారు.
అయితే యూఎస్ఏ టీంతో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్లు మూడు వికెట్లు తీసి, 27 పరుగులు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే.



