Monday, December 8, 2025
E-PAPER
Homeఖమ్మంటీఎస్ యూటీఎఫ్ నేత కట్టా మధు గుండెపోటుతో మృతి

టీఎస్ యూటీఎఫ్ నేత కట్టా మధు గుండెపోటుతో మృతి

- Advertisement -

– నివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు చావా రవి

నవతెలంగాణ – అశ్వారావుపేట

యూటీఎఫ్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు, అశ్వారావుపేట వాసి,దురద పాడు ఉపాద్యాయుడు కట్టా మధు ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. అశ్వారావుపేటలోనే యూటీఎఫ్ జిల్లా మహాసభలు జరుగుతున్న క్రమంలో ప్రారంభం కార్యక్రమంలో ఉత్సాహంగానే పాల్గొన్న మధు స్వస్థి చేయడంతో ఇంటికి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి తీవ్ర అస్వస్థతకు గురై ఒక్క సారిగా కుప్పకూలారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక హాస్పిటల్ కి తరలించారు.చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న వెంటనే మహాసభల్లో మౌనం పాటించి,సంతాపం ప్రకటించిన ప్రతినిధులు,రాష్ట్ర అద్యక్షులు చావా రవి, కార్యదర్శి రాజులు మధు మృతదేహం సందర్శించి నివాళులు అర్పించారు. మధుకి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -