Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి కీలక బాధ్యతలు

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి కీలక బాధ్యతలు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకుడిగా తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణకు ఏఐసీసీ సీనియర్‌ పరిశీలకులను నియమించింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో అస్సాం ఎన్నికల పరిశీలకులుగా భూపేష్‌ భగేల్‌, డీకే శివకుమార్‌, బంధు టిర్కి, కేరళకు సచిన్‌ ఫైలెట్‌, కేజె జార్జ్‌, ఇమ్రాన్‌, కన్హయ్య కుమార్‌, తమిళనాడు, పుదుచ్చేరికి పరిశీలకులుగా ముఖుల్‌ వాస్కీ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఖాజి మహ్మద్‌ నిజాముద్దీన్‌.. పశ్చిమ బెంగాల్‌కు సుదీప్‌ రాయ్‌ భర్మన్‌, షకీల్‌ అహ్మద్‌ ఖాన్‌, ప్రకాష్‌ జోషిని నియమించినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శ కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -