Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీస్ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించాలని యూపీ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకంలో భాగంగా 4 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కానిస్టేబుల్ పోలీస్, కానిస్టేబుల్ PAC, మౌంటెడ్ పోలీస్, ఫైర్ మ్యాన్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది(2026)లో ఫస్ట్ బ్యాచ్ రిక్రూట్మెంట్ జరగనుంది. జనరల్, SC, ST, OBC అభ్యర్థులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. వీరికి మూడేళ్ల వరకు వయో సడలింపు ఉండనుంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా అగ్నివీర్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళంలో నియమకాలు చేపట్టారు. సైనికుడిగా వారి పదవీకాలం 4 సంవత్సరాలుగా నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -