Friday, February 6, 2026
E-PAPER
Homeఆటలువైభ‌వ్ సూర్య‌వంశీ.. ప‌రుగుల సునామీ

వైభ‌వ్ సూర్య‌వంశీ.. ప‌రుగుల సునామీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైనల్ పోరులో వైభ‌వ్ సూర్య‌వంశీ 175(15ఫోర్లు, 15 సిక్స్‌లు) ప‌రుగులతో సునామీ సృష్టించాడు. 55 బంతుల్లో 100 పూర్తి చేసిన వైభ‌వ్‌..కేవ‌లం 17 బంతుల్లోనే 50 ర‌న్స్ చేసి 150 మార్కును ఆందుకున్నాడు. సెంచ‌రీ త‌ర్వాత త‌న బ్యాట్‌కు మ‌రింత ప‌దును పెట్టి ఇంగ్లాండ్ బౌల‌ర్లపై భారీ షాట్‌ల‌తో విరుచుకుప‌డ్డాడు. ప్ర‌తి బౌలింగ్‌లో ఫోర్లు, సిక్స్‌ల‌తో స్టేడియం న‌లుమూలాల వినూత్న షాట్‌ల‌తో ఆల‌రించాడు. వైభ‌వ్ భీక‌ర్ ఆట తీరుతో ఇంగ్లాండ్ కెప్ట‌న్‌ను హ‌డ‌ల్ ఎత్తించాడు. ఎవ‌రికి బౌలింగ్ ఇచ్చినా.. ఆకాశమే హ‌ద్దుగా ఫోర్లు, సిక్స‌ల‌తో బాల్‌ను స్టేడియాన్ని దాటించాడు. 28 ఓవ‌ర్లు పూర్తియ్యేస‌రికి 3 వికెట్లు కోల్పోయి భార‌త్ 273 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో వేదాంత్‌(22),విహాన్(10) ఉన్నారు. కెప్టెన్ ఆశిష్ మాత్రే అర్ధ సెంచ‌రీతో అమూల్య‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. సెమీ ఫైన‌ల్‌లో సెంచ‌రీతో చెల‌రేగిన అరోన్ జార్జీ 9 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -