- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు నుంచి హూటాహూటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వంశీకి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. అయితే, విషయం బయటకు తెలియడంతో ఆస్పత్రి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నట్లు సమాచారం.
- Advertisement -