Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీప్రత్యంగిరా కోటిలింగేశ్వర దేవస్థానంలో వన మహోత్సవం

శ్రీప్రత్యంగిరా కోటిలింగేశ్వర దేవస్థానంలో వన మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి గ్రామ శివారులో గల శ్రీప్రత్యంగిరా కోటిలింగేశ్వర దేవస్థానంలో ఆదివారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన సాయి చందన పిల్లల ఆస్పత్రి డాక్టర్ శైలజ శివరాజ్ పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కర్తలు భువన గంగా ప్రసాద్ దీక్షితులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీప్రత్యంగిరా కోటిలింగేశ్వర దేవస్థానంలో మన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏకబిల్వం, తులసి, మేడి, రావి, గులాబి, మందారం, కొబ్బరి చెట్లు నాటినట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ శైలజ శివరాజ్ మాట్లాడుతూ ప్రకృతి సమతుల్య కోసంప్రతి ఒక్కరు తమ జన్మదినము రోజున కనీసం 11 చెట్లు నాటాలన్నారు. వాయు కాలుష్యం నివారణ కు మన భారతదేశంలో 60 లక్షల కోట్ల చెట్లు అవుసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం నాటే మొక్కలు వృక్షాలై భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును అందిస్తాయన్నారు. ప్రతి ఒక్కరు వన మహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో నాటుకునేందుకు పలువురికి పలు రకాల మొక్కల్ని అందజేశారు.కార్యక్రమంలో  గ్రామ ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -